స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రపరిచారు
NEWS Sep 30,2024 01:56 pm
మెట్‌పల్లి పట్టణంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్‌తో కలిసి కొంతమంది పట్టణ యువకులు స్వచ్ఛందంగా న్యూ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో 30 మంది పట్టణ యువకులు భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ.. పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మీ ఇంటి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఈ లాంటి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.