శ్రీవారి స్మరణ కోసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్నిసులువుగా పఠించేందుకు అనువుగా సంగీత దర్శకుడు కీరవాణి ప్రత్యేకంగా చిన్న ఆడియోను రూపొందించారు. దాంతో కీరవాణికి జనసేనాని ధన్యవాదాలు తెలుపుతూ లేఖను విడుదల చేశారు. తన దీక్షకు సంఘీభావంగా ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారని, అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డు చేశారు. అది భక్తి భావంతో సాగింది. ఆ సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు అని జనసేనాని చెప్పారు.