అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించొద్దు
NEWS Sep 30,2024 08:22 am
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు (అక్టోబర్ 1వ నుండి 31 వరకు) 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారులు ముందస్తు అనుమతి లేకుండా సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, ర్యాలీలు, మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతిభద్రతలకు దొంగ కలిగించే విధంగా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యలాపాలు చేపట్టకూడదన్నారు.