పవన్ తిరుమల షెడ్యూల్ ఇలా..
NEWS Sep 30,2024 07:56 am
పవన్ కల్యాణ్ అక్టోబర్ 1న రేణిగుంట విమానాశ్రయం వెళ్లి, అక్కడి నుంచి 4 గంటలకు అలిపిరి పాదాల మండపం చేరుకుని పూజలు చేస్తారు. కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. 2న ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమిస్తారు. అన్న ప్రసాద వితరణను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.