తెలంగాణలో డీఎస్‌సీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. దసరాలోపు ఎల్‌బీ స్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి.