కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు
NEWS Sep 30,2024 07:49 am
తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు దుబ్బాకలో కోర్టు ఆవరణలో న్యాయ వాదులు ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ వెంటనే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలుపరచాలని, 41-A Cr.P.C ని వెంటనే రద్దుపరచాలని, కోర్టులలో టెన్యూర్ పోస్టులను ఇదివరకు మాదిరిగానే కొనసాగించాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు రావు, AGP చిలుకోటి నాగరాజు, చిటుకుల అశోక్, రామవరం భాస్కర్ రెడ్డి, శ్రీరాం రామకృష్ణ పాల్గొన్నారు.