బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన భువనేశ్వరి
NEWS Sep 30,2024 07:48 am
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ టెస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. ప్రకాష్ నగర్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ స్వచ్ఛంద రక్తదానాలను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించినట్లు చెప్పారు.