వైసీపీ నేతలు ఒక్క రోజు దీక్ష
NEWS Sep 30,2024 07:48 am
బండారులంక: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డుపై ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామి అంటూ అమలాపురం రురల్ మండలం బండారులంక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వైసీపీ పార్టీ నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. బండారులంక గ్రామ కమిటీ అధ్యక్షుడు కామిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.