బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
NEWS Sep 30,2024 06:48 am
బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడబెట్టినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అలాగే తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడాన్ని విమర్శిస్తూ.. తాము ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారసత్వ రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు.