మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
NEWS Sep 30,2024 06:32 am
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. OCT 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. 1950లో కోల్‌కతాలో జన్మించిన మిథున్.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు.