మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి వద్దగల ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ పొల్యూషన్ పెరిగిపోయిందని, శబ్దాలు కూడా వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. కంపెనీ ముందు మహిళలతో సహా బైఠాయించారు. కంపెనీ విస్తరణ కూడా అనుమతులు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.