కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన హ్యారీ
NEWS Sep 30,2024 04:16 am
ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును ఇంగ్లండ్ సారథి హ్యారీ బ్రూక్ బద్దలు కొట్టాడు. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన ఐదో వన్డేలో ఈ యంగ్ ప్లేయర్ ఈ ఘనత సాధించాడు. బ్రూక్ ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 78 సగటు, 127.86 స్ట్రైక్‌రేటుతో 312 పరుగులు చేశాడు. కేవలం 2పరుగుల తేడాతో కోహ్లీ రికార్డును బ్రూక్ బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాత ఎంఎస్ ధోనీ 285 పరుగులతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.