ఆపన్న హస్తం అందించిన చొప్పదండి MLA
NEWS Sep 30,2024 03:06 am
మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నల్ల మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన ఆక్సిడెంట్ లో ఒక కాలు కోల్పోయారు. అతనికి అత్యవసర చికిత్స అవసరం అని స్థానిక కాంగ్రెస్ నాయకులు MLA మేడిపల్లి సత్యంకు తెలియజేయగా.. స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిది నుండి ఆర్థిక సాయంగా తక్షణ వైద్య ఖర్చులకు రూ.1లక్ష 25వేలు మంజూరు చేయించి, హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా కోరారు.