గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి భార్యాభర్తలు దశరథ నాయక్ (45) జయబాయి (42) మృతి చెందారు. దంపతులకు చెందిన కుమారుడు జగదీష్ నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ముందున్న ఆవుల షెడ్ లో వర్షం వస్తున్న సమయంలో పాలు పిండుకుంటుండగా ఈ ఘటన జరిగింది. లక్ష రూపాయలు విలువచేసే రెండు పాడి ఆవులు కూడా మరణించాయి.