రౌడీషీటర్లుకు సీఐ సునీత కౌన్సిలింగ్
NEWS Sep 30,2024 03:01 am
పుట్టపర్తి అర్బన్ స్టేషన్లో పాత కేసులో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లకు పుట్టపర్తి సిఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మీ ప్రవర్తనపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని ఏలాంటి గొడవలకు వెళ్లిన సమస్యలు సృష్టించిన ప్రేరేపించినా కారణమైనా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో నడుచుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సీఐ సునీత సూచించారు.