జీ.ఓ నెం.3 ని పునరుద్ధరణ చేయాలి
NEWS Sep 30,2024 03:04 am
భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన జాయింట్ యాక్షన్ కమిటి సమావేశంలో టిటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు బానోత్ రాములు నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జీవో నెం:3 పునరుద్ధరణ అంశంపై గిరిజన, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ,ప్రజల సమస్యలు వాటి సాధనపై సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ కమిటీకి సలహాలు సూచనలు ఇచ్చారు. కులసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీని (JAC) ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.