అక్టోబర్ 2న ప్రశాంత్‌కిషోర్ కొత్త పార్టీ
NEWS Sep 29,2024 04:16 pm
పాట్నా: అక్టోబర్ 2న బీహార్‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పార్టీ పేరు, నాయకత్వంతో సహా అన్ని వివరాలు ఆ రోజు వెల్లడిస్తానని చెప్పారు. ‘జన సురాజ్’ పేరుతో బీహార్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. తాను లీడర్ కావాలని ఆశించలేదని, కొత్త పార్టీకి నాయకుడిగా ఉండనని, ప్రజలు నాయకత్వ పాత్ర పోషించాల్సిన సమయం ఇదన్నారు.