మడకశిరలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి
NEWS Sep 29,2024 02:39 pm
మడకశిర మండలం జిల్లెడు కుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఏడుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 26,100 నగదు, 7 మోటర్ సైకిలను 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు మడకశిర టౌన్ CI రామారావు తెలిపారు. మడకశిర మండలంలో ఎక్కడైనా మట్కా గాని, గ్యాంబ్లింగ్ గాని ఆడే వారి సమాచారం ఇవ్వాలని కోరారు.