సుడా చైర్మన్ కు రెడ్డి సంఘాల సన్మానం
NEWS Sep 29,2024 02:50 pm
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ బివిఆర్ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని రెడ్డి సంఘాలను కలుపుకుని సీతారాంపూర్ లోని రెడ్డి కళ్యాణ మంటపంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఘన సన్మానం చేశారు. మొదట నరేందర్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు రాజా బహద్దూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కోలాటాలు డప్పులు ఒగ్గుడోలు కళాకారులతో ర్యాలీగా రెడ్డి కళ్యాణ మంటపం చేరుకున్నారు. రెడ్డి సంఘాల ప్రతినిధులు సుడా చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.