కోరుట్లలో 10వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలు
NEWS Sep 29,2024 02:29 pm
కోరుట్ల: కోరుట్ల మినీ స్టేడియంలో 10వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సెక్రెటరీ ఏలేట ముత్తయ్య రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రతిష్ఠ పెంచేది క్రీడాకారులేనని, క్రీడల వల్ల ధృడత్వం మానసిక ఉల్లాసం పెంపొందించడంతో పాటు స్నేహ భావం ఏర్పడుతాయని అన్నారు. మారుముల గ్రామాల్లో క్రీడలను వెలికి తీసే ఉద్దేశ్యంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు.