ఏపీలో లులూ మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్..
NEWS Sep 29,2024 10:08 am
ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ ప్రకటించారు. చంద్రబాబుతో తనకు 18 ఏళ్ల అనుబంధం ఉందన్న లులూ ఛైర్మన్.. ఆయనతో చర్చలు ఫలవంతమైనట్లు తెలిపారు. విశాఖలో లులూ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్.. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్లు పెడతామని, ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టింగ్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.