మంచినీటి సహాయకుల శిక్షణ శిబిరం
NEWS Sep 29,2024 09:51 am
ప్రతి గ్రామంలో మంచినీరు అందే విధంగా ప్రతి ఒక్క నీటి సరఫరాల అధికారి కృషి చేయాలని ఏఈ ఆర్డబ్ల్యూఎస్ చంద్రశేఖర్ కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి వీధికి మిషన్ భగీరథ నీరు అందే విధంగా, అవి కలుషితం లేకుండా శుభ్రంగా ఉంచేలా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరుపైన ఉందని దానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ఇంటింటికి వచ్చే మంచినీరు శుభ్రంగా ఉండేలా లక్ష్యం పెట్టుకోవాలన్నారు.