అర్ధరాత్రి ఆటో ఎక్కిన ఏసీపీ సుకన్య
NEWS Sep 29,2024 09:42 am
ఆగ్రా ఏసీపీ సుకన్య శర్మ సివిల్ డ్రెస్ ధరించి.. టూరిస్టు మాదిరిగా అర్ధరాత్రి ఆటో ఎక్కారు. పోలీసులు, వ్యవస్థ ఎలా ఉందో టెస్టు చేశారు. ఏసీపీ నిర్వహించిన ఈ ఉమెన్ సేఫ్టీ టెస్టుల్లో ఆటో డ్రైవర్.. అటు పోలీసు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ సిబ్బంది పాసయ్యారు. సిటీలో మహిళల భద్రతను పరిశీలించేందుకు అర్ధరాత్రి ఆమె ఆటోలో ఒంటరిగా ప్రయాణించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నంబర్ 112 పనితీరును ఆమె స్వయంగా తెలుసుకుని ప్రశంచించారు.