RRR: వాడని వస్తువులు అందించండి
NEWS Sep 29,2024 09:44 am
మెట్‌పల్లి: స్వచ్ఛతా హి సేవ లో భాగంగా కమిషనర్ మోహన్ మెట్ పల్లి మున్సిపల్ ఆఫీస్ లో ఆదివారం RRR (reduce, reuse, recycle) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమo ఉద్దేశం మన ఇంటి వద్ద వాడని బట్టలు, పుస్తకాలు, ఆట వస్తువులు, ఇతర వస్తువులు ఏమైనా తిరిగి ఉపయోగించగలిగేటట్టు ఉంటే వాటిని ఇతరులకు అందించడం. పలువురు తీసుకొచ్చిన వస్తువులను ఆయన స్వీకరించి ఇతరులకు అందించారు. వస్తువులను మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు.