మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి సాయం
NEWS Sep 29,2024 09:49 am
వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన జగిత్యాల మున్సిపల్ కార్మికుడు మారంపల్లి పోచయ్యకు జానకిరామ్ హౌసింగ్ బోర్డ్ సభ్యుల సహకారంతో వారి కుటుంబానికి ₹ 33,600 ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు కాలనీవాసులు. 15 ఏళ్లుగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికునిగా సేవలందిస్తూ అందరితో కలిసిపోయేవాడని కాలనీవాసులు గుర్తు చేసుకున్నారు.