హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కేసు
NEWS Sep 29,2024 06:22 am
కూకట్‌పల్లినికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తన ముగ్గురు కూతుళ్లకు రాసిచ్చిన ఇండ్లు కూల్చేస్తారేమోనని భయపడి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదయింది. 16063/IN/224 కింద రంగనాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ప్రకటించారు. ఆమె ఇంటికి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.