ఆ ప్రచారం నిజం కాదు: ఎమ్మెల్యే
NEWS Sep 29,2024 06:14 am
తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ని నియమించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని మైలవరం ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కొందరు సామాజిక మాధ్యమాల్లో పదే పదే ఇష్టానుసారంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా నియమించినట్లు పోస్టు చేస్తున్నారని, ఇందులో వాస్తవం లేదని పేర్కొంది.