దసరా నుంచి ఇంటింటికి RTC సేవలు
NEWS Sep 29,2024 05:09 am
తెలంగాణ ఆర్టీసీ ఇంటింటికి కార్గో సేవలు అందించనుంది. దసరా నుంచి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్‌లో డెలివరీ చేస్తారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీలర్ ద్వారా డెలివరీ చేస్తారు. ముందుగా దీన్ని హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ దశలవారీగా అమలు చేస్తారు. .