శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం
NEWS Sep 29,2024 05:05 am
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి గడియ వేసుకున్నారు. ఆదివారం ఉదయం అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అది వచ్చి వెళ్లినట్టు స్పష్టంగా అందులో రికార్డు కావడంతో ఆ ప్రాంతంలో చిరుత కోసం గాలిస్తున్నారు. అయితే, రాత్రిపూట కావడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.