నిండుకుండలా సింగూర్ జలాశయం
NEWS Sep 29,2024 08:50 am
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఏం.బాగారెడ్డి సింగూర్ జలాశయంలో ఓపెన్ ఉన్న 2 క్రస్ట్ గేట్లలో ఒక దాన్ని మూసివేసినట్లు ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు.ఎగువ ప్రాంతం నుంచి వరద తగ్గడంతో 6వ గేటు క్లోజ్ చేసి,11వ గేటు ద్వారా 1.5 మీటర్ ఎత్తులో 17,236 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నామని,ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఆదివారం ఉదయం 6 గంటలకు సమయం వరకు 16,194 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.