మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా
బత్తిని మహేశ్వరి శ్రీనివాస్
NEWS Sep 29,2024 04:55 am
మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముత్యంపేట గ్రామానికి చెందిన బత్తిని మహేశ్వరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తన నియామకానికి సహకరించిన MLA మేడిపల్లి సత్యంకు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశంతో మల్యాల, కొడిమ్యాల మండలంలోని రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తానని, మార్కెట్ ను జిల్లాలో ఉన్నత స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.