సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు
NEWS Sep 29,2024 04:52 am
వర్షాలు కురుస్తున్నందున సింగూరుకి వరద నీరు చేరుతుందని ఇరిగేషన్ ఎ ఈ మహిపాల్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల వరకు 16,194 క్యూసెక్కు నీరు సింగూరు ప్రాజెక్టులోకి చేరిందని చెప్పారు.17,236 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి కింది భాగానికి వదిలినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో 29.678 టీఎంసీలకి గాను 29.9 2017 టీఎంసీల నీరు ఉందని వివరించారు.