రామ్ చరణ్ - శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ నుంచి సెకెండ్ సింగిల్ రా మచ్చా పాట ప్రోమోని విడుదల చేశారు. ఇందులో చెర్రీ డీసెంట్ లుక్ లో కనిపించాడు. 45 సెకెన్ల ప్రోమోలో వివిధ రాష్ట్రాలకి చెందిన డ్యాన్స్ సంస్కృతులను చూపించారు. ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా సింగర్ నకాష్ నజిజ్ పాడాడు. సాంగ్ 30వ తేదీన విడుదల చేస్తారు.