ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో కీలక నిర్ణయం
NEWS Sep 28,2024 04:43 pm
రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుల స్థానంలో అన్ని సేవలనూ కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు కిందకు తీసుకురావాలని, ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తిస్తామని సీఎం రేవంత్ నిర్ణయించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలున్నింటినీ కార్డు వెనుక పొందుపర్చాలని, అక్టోబర్ 3 నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.