IPL ఆటగాళ్లకు BCCI బంపర్ ఆఫర్!
NEWS Sep 28,2024 04:43 pm
ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI సెక్రటరీ జైషా బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2025 IPL సీజన్ నుంచి ఆటగాళ్లకు ఒక్కో IPL మ్యాచ్కు గానూ రూ. 7.5 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు తన ‘X’ ఖాతాలో ఆయన పోస్ట్ చేశాడు. అంటే.. IPLలో అన్ని మ్యాచ్లు ఆడిన ఆటగాడికి కాంట్రాక్ట్ అమౌంట్ కాకుండా అదనంగా రూ.1.05 కోట్లు పొందే అవకాశం దక్కుతుంది. IPL వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీలు మ్యాచ్ ఫీజుగా చెల్లించడం కోసం రూ.12.60 కోట్లు కేటాయిస్తారు.