టిఫిన్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు
NEWS Sep 28,2024 03:12 pm
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో పట్టణంలో ఉన్న టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని 3000 జరిమానా విధించారు. టిఫిన్ సెంటర్లలో పార్సల్ కట్టేటప్పుడు చట్నీని ప్లాస్టిక్ కవర్లో కడితే కఠిన చర్యలు తప్పవని, మిగిలిపోయిన చట్నీనీ ఫ్రిజ్లో పెట్టి తిరిగి మరసటి రోజు వాడకూడదన్నారు. టిఫిన్ సెంటర్లో కిచెన్ రూమ్ పరిశుభ్రంగా ఉంచాలని, వాడిన నూనె మరుసటి రోజు వాడకూడదని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.