జిల్లా ఆర్యవైశ్య కార్యదర్శిగా గంగాధర్
NEWS Sep 28,2024 04:06 pm
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య కార్యదర్శిగా ఆమెటి గంగాధర్ ను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి ఉత్తర్వులు జారీ చేశారు. గంగాధర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్యవైశ్యుల గురించి ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఆర్యవైశ్య అభ్యున్నతికి, సంఘంలో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడానికి ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల అధ్యక్షులు మైలారపు నరేందర్, అజయ్, శ్రీనివాస్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.