ఎమ్మెల్యే కొలికిపూడిపై సీఎం చంద్రబాబుకు
మీడియా ప్రతినిధులు ఫిర్యాదు
NEWS Sep 28,2024 02:03 pm
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌పై మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని కంప్లైంట్ చేశారు. కొలికిపూడి తమను బెదిరిస్తూ కించపరిచిన ఆధారాలను సీఎంకు అందచేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసన్న సీఎం సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.