డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో
106.6 కిలోల గంజాయి దహనం
NEWS Sep 28,2024 03:55 pm
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్‌లలో నమోదైన 43 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 106.6 కిలోలను దహనం చేశారు. NDPS చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేశారని, దహనం చేసిన గంజాయి విలువ రూ. 25 లక్షలు ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.