వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి.. నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
NEWS Sep 28,2024 01:27 pm
ప్రభుత్వపరంగా ప్రజలకు నిజాలు చెప్పేలోపే వైసీపీ నేతల ద్వారా జగన్ అబద్ధాలు వ్యాప్తి చెందేలా కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సీఎం భేటీ అయ్యారు. డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి ఇష్టంలేక తిరుమల టూర్ రద్దు చేసుకున్న జగన్.. మనం అడ్డుకున్నామంటూ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామని, భవిష్యత్తులోనూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు