దుర్గగుడిలో నాసిరకం సరుకులు.. స్టోర్స్ ఏఈవోపై బదిలీ వేటు
NEWS Sep 28,2024 12:54 pm
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ ఆలయంలో నాసిరకం సరుకులు సరఫరాపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆలయ స్టోర్స్ ఏఈవో రమేష్ బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరికొందరు ఆలయ ఉద్యోగులపైనా చర్యలకు రంగం సిద్ధమైంది. దసరాలోపు ఇతర ఉద్యోగుల పాత్రపై నివేదిక ఇవ్వాలని ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.