జగన్‌పై హోంమంత్రి అనిత సెటైర్లు
NEWS Sep 28,2024 12:43 pm
తిరుమల టూర్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ రద్దు చేసుకోవడానికి చెప్పినవన్నీ కుంటిసాకులే అన్నారు హోంమంత్రి అనిత. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టంలేకనే ఆయన డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని.. ప్రసాదం ఇస్తే పక్కనపెట్టే జగన్.. లడ్డూ రుచిపై మాట్లాడడం విడ్డూరమన్నారు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావాలనుకునే తత్వం జగన్‌దని, అందుకే తాడేపల్లిలోని నివాసం వద్ద తిరుమల ఆలయం సెట్టింగ్ వేసుకున్నాడని అనిత గుర్తు చేశారు.