చాక్‌పీసు చిత్రంతో భగత్ సింగ్‌కు నివాళి
NEWS Sep 28,2024 12:38 pm
భగభగ మండే అగ్నిఖనిక, విప్లవ వీరకిశోరం షాహిద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు సుద్ద ముక్కలను ఉపయోగించి 2 రోజులు శ్రమించి భగత్ సింగ్ అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి నివాళులు అర్పించారు. 24 ఏళ్ల వయసులో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఉరికంబానికి అంకితం చేసిన మహా దేశ భక్తుడు భగత్ సింగ్ అని ఆయన కొనియాడారు.