హెజ్‌బొల్లా చీఫ్ హాసన్ నస్రల్లా మృతి
NEWS Sep 28,2024 12:02 pm
బీరుట్‌పై జరిపిన దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హాసన్ నస్రల్లాను మట్టుబెట్టినట్లు.. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న భీకరపోరు సంచలనంగా మారింది. అయితే లెబనాన్‌లోని హెజ్‌బొల్లా హెడ్ క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. భారీ బాంబులతో దాడులు విరుచుకుపడటంతో పదుల కిలోమీటర్ల మేర దాని ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఇక మరో దాడిలో నస్రల్లా కుమార్తె కూడా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు సైన్యం తెలిపింది.