తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ
NEWS Sep 28,2024 11:47 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక SKNR ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, సాంస్కృతిక శాఖ NSS, NCC ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా జగిత్యాల జిల్లా జడ్జి జస్టిస్ నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ నీలిమ మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ అద్దం పడుతుందని, నేటి యువత బతుకమ్మ గురించి తెలుసుకోవాలన్నారు.