కల్లుగీత వృత్తిదారులకు
రక్షణ కల్పించాలని వినతి
NEWS Sep 28,2024 04:29 pm
కల్లుగీత వృత్తిదారులకు కాంట్రాక్టర్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఎక్సైజ్ సూపరింటెండ్ నవీన్ చంద్రకు శనివారం వినతిపత్రం సమర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జిల్లాలో కల్తీ కల్లును అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు, కొండాపూర్ మండల కార్యదర్శి రాజయ్య, నాయకులు పి. అశోక్, బాబూరావు, రమేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు