కలెక్టరమ్మ..ఈ వింత చూడమ్మా.!
NEWS Sep 28,2024 11:48 am
ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డు ఉండాలి.కానీ దానికి భిన్నంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో ఎక్కడ కూడా సమాచార హక్కు చట్టం బోర్డు లేదు.గత 15 నెలల క్రితం స.హ చట్టం 2005 సూచిక బోర్డు ఉండేది కానీ దాంట్లో అధికారుల పేర్లు తప్పులతడకగానే దర్శనమిచ్చాయి.ఇప్పుడు చూస్తే మాత్రం ఆ సూచిక బోర్డు స్థానంలో రెండు రెడ్ కలర్ నోటీసు బోర్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఆర్డిఓ ఆఫీస్ లో అధికారి స్వర్ణలత మారిన ఇప్పటికీ ఆమె పేరే ఉంది.