అక్టోబర్ 4న చలో కలెక్టరేట్ ముట్టడి
NEWS Sep 28,2024 10:49 am
ఇబ్రహీంపట్నం: రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చే నెల 4న చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి కోరారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గుడేటి కాపు సంఘ భవనంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు రైతులు పాల్గోన్నారు.