కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు బసవా చినబాబుకు ప్రమాదవశత్తు కుడికాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన విశాఖపట్నంలో ఆపరేషన్ చేయించుకుని కోలుకుని ఆయన కూనవరంలోని తన స్వగృహంకి వచ్చారు. ఆయనను ఇంటి వద్ద శనివారం కాపు సంక్షేమ సేన నాయకులు కనకాల దొరబాబు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి తోట బాబీ కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.