పారిశుద్ధ కార్మికుల రక్షణ కిట్స్ పంపిణీ
NEWS Sep 28,2024 10:54 am
మెట్‌పల్లి: మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి పట్టణంలో పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య దృష్ట్యా వారికి ఆప్రన్లు, గ్లౌజులు, బూట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. వీటిని ధరించే కార్మికులు పనులు నిర్వహించాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇ నాగేశ్వరరావు ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.